గుంటూరు జనసేన కమిటీ నియామక పత్రాల పంపిణీ
గుంటూరు జనసేన పార్టీ కార్యాలయం నందు శనివారం 6, 10వ డివిజన్ లకు జనసేన కమిటీని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో 6వ డివిజన్లో అధ్యక్షులకు మరియు 10వ డివిజన్లో కమిటీ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ ఈరోజు 10వ డివిజన్లకు సంబంధించి నియామక పత్రాలు అందజేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఈ యొక్క కమిటీ సభ్యులే పార్టీలో ముఖ్యపాత్ర పోషిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వార్డు కమిటీ సభ్యులు, జనసైనికులు, వీరమహిళలు, తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-10-at-10.45.19-PM-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-10-at-10.45.20-PM-4-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-10-at-10.45.20-PM-2-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-10-at-10.45.21-PM-1024x466.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-10-at-10.45.21-PM-2-1024x466.jpeg)