నిరాశ్రయుల ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసిన నర్సీపట్నం జనసేన

నర్సీపట్నం, పెద్ద బొడ్డేపల్లి నిరాశ్రయుల ఆశ్రమంలో దాతలు పూడి స్వామినాయుడు కుటుంబం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గం జనసేన ఇన్చార్జి రాజన్న వీర సూర్యచంద్ర చేతులమీదుగా నిరాశ్రయులకు ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథిగా పిలిచినందుకు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేశారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలతో పాటుగా నర్సీపట్నం టౌన్లో కూడా రిటైర్డ్ ఉద్యోగులు మరియు అత్యంత సేవాభావం కలిగిన వ్యక్తులు అందరికీ కూడా జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నాము అని అన్నారు. పేద ప్రజలకు సేవ చేయడంలో పేదల పక్షాన నిలబడి ఉన్నటువంటి సంఘ సేవకులు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఉద్యోగులు ప్రజలకు సేవ చేయడం తో పాటుగా ప్రజా సమస్యలపై అవగాహన కల్పిస్తున్న వారందరినీ కూడా స్వయంగా వెళ్లి వారి ఆలోచనలతో ముందుకు తీసుకువెళ్తామని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తాత బాబు మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి దాతలు, సేవాభావం కలిగిన వ్యాపారస్తులు, రిటైర్డ్ ఉద్యోగులు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం అన్నారు. రిటైర్డ్ టీచర్ స్వామి నాయుడు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తన స్వగ్రామమైనటువంటి చెట్టుపల్లి గ్రామంలో వయోవృద్ధులకు దుప్పట్ల పంపిణీ చేస్తున్నామని అంతేకాకుండా సమీపంలో ఉన్నటువంటి పెద్ద బొడ్డేపల్లి నిరాశ్రయులు ఆశ్రమంలో పంపిణీ చేయడం వీటితో పాటుగా గుడి ముందు యాచించే యాచకులకు కూడా పంపిణీ చేస్తున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, మున్సిపాలిటీ నాయకులు తాతబాబు, నాతవరం నాయకులు వెంకటరమణ, రాజన్న , నూకన్న తదితరులు పాల్గొన్నారు.