చిరంజీవి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా బ్లడ్ బ్యాంకుకు స్ట్రెస్ బాల్స్, ఫ్రూటిలు, ప్లాస్టర్స్ పంపిణీ

మనకి ప్రాణం పోసిన ఆ భగవంతుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి మరొకరికి ప్రాణాలు పోసే అవకాశం కల్పించాడు అదే రక్తదానం. ఏ దానం చేయాలన్నా అది విద్యా, విజ్ఞానం, డబ్బుతో ముడిపడి ఉంది కానీ ఒక రక్తదానమే ఓ మంచి మనసుతో ముడిపడి ఉంది. పద్మభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి. అన్నయ్య చిరంజీవి మాటలను స్ఫూర్తిగా తీసుకొని అత్యవసర పరిస్థితుల్లో రక్త దానం చెయ్యడానికి స్వఛ్చందంగా వస్తున్న రక్త దాతలకు ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు రవణం స్వామి నాయుడు మరియు మన అఖిల భారత చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు భవాని రవి కుమార్ ఆదేశాల మేరకు చిరంజీవి గారి 50 రోజుల పుట్టిన రోజు వేడుకలలో భాగంగా బుధవారం కదిరి ప్రభుత్వ హాస్పిటల్ నందు ఉన్న రక్తనిధికి స్ట్రెస్ బాల్స్, ఫ్రూటిలు, ప్లాస్టర్స్ కదిరి ప్రభుత్వ హాస్పిటల్ సూపరిడెంట్ హుస్సేన్ కు రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అందించడం జరిగింది. హాస్పిటల్ సూపర్డెంట్ హుస్సేన్ మాట్లాడుతూ.. సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని.. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది అభిమానులు అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడానికి ముందుకు వస్తున్నారని.. అదే క్రమంలోనే ఈ రోజు కదిరి మెగా ఫ్యామిలీ అభిమానులు ముందుకు వచ్చి రక్తనిధికి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతూ అంతే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడానికి మేము ఎప్పుడూ సిద్దంగా ఉంటారని చెప్పడం చాలా సంతోషించ దగిన విషయం అన్నారు. గతంలో కూడా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ క్యాంప్లు ఏర్పాటు చేసి రక్తదానం చెయ్యడం జరిగింది. వీరికి కదిరి ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అని అన్నారు. రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ మాట్లాడుతూ.. అన్నయ్య చిరంజీవి గారి స్ఫూర్తితో అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చెయ్యడానికి మన మెగా ఫ్యామిలీ అభిమానుల సహకారంతో ముందుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ యువ ఫౌండేషన్ సభ్యులంతా పాల్గొనటం జరిగింది.