వారది ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ

హిందూపురం: వారది చారిటబుల్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో చిన్మయ స్కూల్ నందు విద్యార్థులకు 25,000 రూపాయల విలువ గల పుస్తకాలు పిల్లలకు అందివ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ మున్ముందు కూడా ప్రతిభ గల నిరుపేద విద్యార్థులకు సహాయ సహకారాలు అందిస్తుందని సభ్యులు పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నిమ్మకాయల రాము, డి.ఆర్.జి శ్రీకాంత్, మంజునాథ్, చంద్ర, పవన్ కుమార్, చరణ్, విజయ్, మహేష్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉషశ్రీ, రూప లేఖ, పవన్ పాల్గొనడం జరిగింది.