ట్రాఫిక్ పోలీసులకు కొబ్బరి నీళ్లు మరియు మజ్జిగ పంపిణీ..

నెల్లూరు: యంగ్ ఇండియన్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించి చదివిస్తూ యువతలో స్ఫూర్తిని నింపుతున్న ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం మండు వేసవిని సైతం లెక్కచేయకుండా డ్యూటీలు నిర్వహిస్తున్న పోలీస్ సోదరులకు టెంకాయ నీళ్ళు మరియు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ.. మండే వేసవిలో ఒక అరగంట బయట తిరిగితేనే బాధపడుతున్న పరిస్థితిని లెక్కచేయకుండా నిరంతరం విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సోదరుల సేవలు చిరస్మరణీయం. అనంతరం పోలీస్ వారు ఈరోజు అనేకమంది పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న యంగ్ ఇండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మజ్జిగ, టెంకాయ నీళ్ళు పంపింణీ చేయడం అభినందనీయం. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలతో స్ఫూర్తిని కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పవన్, శివ, రమేష్, కోటి శ్రీమంత, భవిశెట్టి కిషోర్, గునుకుల కిషోర్ తదితరులు పాల్గొన్నారు.