పెడనలో జనసేన ఆధ్వర్యంలో వెయ్యి మందికి మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ

పెడన నియోజకవర్గం, పెడన పట్టణంలో సోమవారం శ్రీ డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ అధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని స్ధానిక బస్టాండ్ సెంటర్ నందు గల డాక్టర్ బి.అర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రామ్ సుధీర్ పట్టణ ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను అందచేసారు. అనంతరం జనసైనికులు బంటుమిల్లి రోడ్ సెంటర్ వద్ద, గూడూరు రోడ్ లోని రైల్వే గేట్ వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కూనపరెడ్డి రంగయ్య, పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, పేరిశెట్టి విఘ్నేశ్వరరావు, క్రోవి సుందరరాజు, వరుదు రాము, బత్తుల సాంబ శివరావు, కొప్పినీటి శివమణి, కటకం మహేష్, సాయి కిరణ్, నంద కిషోర్, సుబ్బు, అంజిబాబు, వినోద్, సాయి, పెన్నేరు మణికంఠ, పవన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.