జనసేన పార్టీ సిద్ధాంతాలు మ్యానిఫెస్టోతో కూడిన క్యాలెండర్ల పంపిణీ

తాడిపత్రి ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు జనసేన పార్టీ తాడిపత్రి పట్టణ ప్రధాన కార్యదర్శి సయ్యద్ రసూల్ ఆధ్వర్యంలో పాతకోటలో క్యాలెండర్లను ఆ పార్టీ నాయకులు అయుబ్, రసూల్, రాహూల్, అలీ మరియు కార్యకర్తలతో కలిసి పంచడం జరిగింది. ఈ సంధర్భంగా జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ చేసే కార్యక్రమాలు, రైతులకు చేసిన సహాయాలు మరియు పార్టీ మ్యానిఫెస్టోని ప్రజలకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో జనసైనికులు హజీ, షెక్ష, శీను, ఖాజా తదితరులు పాల్గొన్నారు.