పార్వతీపురం జనసేన ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ

  • ప్రతి ఒక్కరూ పూజల కోసం మట్టి వినాయకులని వాడండి పర్యావరణాన్ని రక్షించండి

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం నియోజకవర్గ జనసేన నాయకులు నెయ్యిగాపుల సురేష్, కడగల గణేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు పంపిణీ పార్వతీపురం మెయిన్ రోడ్, వినాయకుని కోవెల దగ్గర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం నియోజకవర్గం సీనియర్ నాయకులు చందక అనీల్, ఇజ్జడ కాళీ, మండల శరత్, సిరిపురపు గౌరీ, వంగాలపుడి నాని, మనేపళ్లి ప్రవీణ్, భమిడిపాటి చైతన్య, సంబాన రమేష్, రెడ్డి నాగరాజు తదితరులు మాట్లాడుతూ మా పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణాన్ని పరిరక్షించడం దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గణపతి ప్రతిమ పట్టణ ప్రజలకు ఇస్తు ప్రతి ఒక్కరూ ఈ వినాయక చవితికి మట్టి వినాయకులను మాత్రమే వాడాలి, మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి రాబోయే తరానికి బహుమతిగా ఇవ్వాలి అని అన్నారు.