ఆచంట జనసేన ఆధ్వర్యంలో కొబ్బరి మొక్కలు పంపిణీ

ఆచంట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజుల వేడుకల్లో భాగంగా బుధవారం కొబ్బరి మొక్కలు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా ఆచంట నియోజకవర్గంలో ఐదు రోజులు వేడుకలు నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అందులో భాగంగా బుధవారం మూడవ రోజు ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామంలో కొబ్బరి మొక్కలు పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఆచంట నియోజకవర్గం సీనియర్ నాయుకులు తోట ఆదినారాయణ, జనసేనపార్టీ వల్లూరు గ్రామ అధ్యక్షులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, రుద్ర కాసుమణి, తోట సాయిబాబా, కడిమి శ్రీనివాస్, ఏడిద తేజా విగ్నేష్, ఏడిద బాలు, అడబాల అజయ్, ఇర్రింకి శ్రీను తదితరులు పాల్గొన్నారు.