డ్రాయింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్ పంపిణీ

ఆచంట, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా ఐదు రోజులు వేడుకల్లో భాగంగా మొదటి రోజులు ఆచంట నియోజకవర్గం, ఆచంట మండలం వల్లూరు గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో జనసేన నాయకులు మండెల శ్రీనివాస్ ఆర్థిక సహాయంతో విద్యార్థినివిద్యార్థులకు డ్రాయింగ్ బుక్స్, కలర్ పెన్సిల్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 నుండీ ఆచంట నియోజకవర్గంలో జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని, ఐదురోజులు వేడుకలు ఆచంట నియోజకవర్గం జనసేన నాయుకులు, వీరమహిళలు అనేక సేవా కార్యక్రమం పండుగ వాతావరణంలో చేయడం సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా జాయింట్ సెక్రటరీ రావి హరీష్ బాబు, వల్లూరు గ్రామ జనసేన అధ్యక్షులు కడిమి ఉమా మహేశ్వరస్వామి, ఆచంట మండలం జనసేన ఉపాధ్యక్షులు తోట ఆదినారాయణ, మండల సెక్రటరీ పంపన శ్రీను, గ్రామప్రధాన కార్యదర్శిలు ఇర్రింకి నాగరాజు, దివి సాయిబాబు, నాయుకులు తోట సాయిబాబా, తాళం రమేష్, కొసన నాయుడు, మొదలగువారు పాల్గొన్నారు.

Share this content:

Post Comment