జనసేన ఆధ్వర్యంలో 200 కుటుంబాలకు నిత్యావసరసరుకుల పంపిణీ

కోనసీమ జిల్లా: జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్ చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు ఆధ్వర్యంలో వరద ముంపు ప్రాంతాలైన అమలాపురం రూరల్ మండలం ఇందుపల్లి పంచాయతీ పరిధిలోని బొంతు వారి పేటలో ఆదివారం 200 కుటుంబాలకు పప్పు దినుసులు, కిరాణా సామగ్రి అందించారు. ఈ కార్యక్రమంలో ఇందుపల్లి ఉపసర్పంచ్ హనుమాన్ బుజ్జి, 10వార్డు సభ్యులు ఆకెళ్ళ నారాయణ మూర్తి, రాష్ర్ట, జిల్లా నాయకులు, సర్పంచ్ లు, ఎంపీ టిసిలు, ఉపసర్పంచ్ లు, వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.