పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ ఆధ్వర్యంలో వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం, పండ్లు పంపిణీ

ఇండ్ల సిద్ధేశ్వర్ శ్రీలత పెళ్లి రోజు సందర్భంగా అదేవిధంగా కూతురు అద్వితీ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలోని వర్ధన్ అనాధాశ్రమంలో అన్నదానం పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నీల వేణు సుష్మ మాట్లాడుతూ చిన్నారులకు అన్నదానం చేయడం చాలా తృప్తిగా ఉందన్నారు. చేరదీసిన ఆశ్రమ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. సేవ చేసేందుకు ప్రేరణ కల్పిస్తున్న పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్ సంస్థ సభ్యులను ప్రశంశించారు. ఈ కార్యక్రమంలో జోగు భాస్కర్, రంజిత్, జోగు ఉదయ్, శివ, గుజ్జుల నాలిన్, రోహిత్, సాయి మను, నాని, ఆలకుంట్ల ప్రశాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.