జనసేన ఆధ్వర్యంలో పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణి

ఆచంట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు వేడుకల్లో ఆచంట నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఐదురోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు వల్లూరు గ్రామంలో సుమారు 50 మందికి భోజనం పార్సిల్స్ పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ 2016 నుండి ఆచంట నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఐదు రోజులు నిర్వహించడం జరుగుతుందని. అందులో భాగంగా ఈ సంవత్సరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు వేడుకలు ఆచంట నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యతిధిగా విచ్చేసిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీ రావి హరీష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50 వ పుట్టినరోజు వేడుకల్లో యువ జనసైనికుడు రుద్ర కాసు మణి తన పుట్టినరోజు వేడుకలు చేసుకుని పేదలకు భోజనం పార్సిల్స్ పంపిణీ చేసిన రుద్ర కాసు మణిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయుకులు తోట ఆదినారాయణ, వల్లూరు గ్రామం జనసేనపార్టీ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, వల్లూరు మెగాఫ్యామిలీ అభిమాన నాయుకులు పంపన శ్రీను, జనసేన నాయుకులు ఏడిద తేజా విఘ్నేష్, వినోద్, రుద్ర కాసు మణి, ఏడిద బాలు, కడిమి శ్రీను మొదలగువారు పాల్గొన్నారు.