జనసేన ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ

శేరిలింగంపల్లి నియోజకవర్గం: మార్చి 11, 2024 జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్న వారికి గురువారం శేరిలింగంపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మాధవరెడ్డి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి ఉచితంగా అద్దాల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.