యాడికి మండలంలో జనసేన క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ

జనసేన పార్టీ తరపున క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు, అభిమానులకు నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేయడం జరిగింది. యాడికి మండలం జనసేన పార్టీ కార్యాలయం నందు మండల కన్వీనర్ సునీల్ కుమార్ అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో ముందుగా క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లను కదిరి శ్రీకాంత్ రెడ్డి మరియు సునీల్ కుమార్ చేతులమీదుగా సన్మానించడం జరిగింది. అనంతరం సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఇన్సూరెన్స్ బాండ్, ఐడెంటిటీ కార్డు, పవన్ కళ్యాణ్ గారి మనోగతం ముద్రించిన బుక్లెట్ను అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తలు పార్టీకి వెన్నుముక లాంటివారని.. వారి మరియు వారి కుటుంబ భద్రతను ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ఈ ఇన్సూరెన్స్ ద్వారా ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 5 లక్షల రూపాయలు మరియు యాక్సిడెంటు బారినపడితే ఆసుపత్రిలో అయ్యే ఖర్చులకు 70 వేల రూపాయలు పార్టీ తరఫున అందిస్తారని తెలిపారు. అదేవిధంగా మండల ఇంచార్జ్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా దాదాపు 80 పైచిలుకు క్రియాశీలక సభ్యత్వం చేయించామని.. త్వరలో పెద్ద స్థాయిలో ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపడతామని అన్నారు. అలాగే ప్రతి ఒక్క కార్యకర్త తమ గ్రామాల్లోని సమస్యలను మండల ఇన్చార్జి దృష్టికి తీసుకురావాలని.. ఆ సమస్యల పరిష్కారం కోసం అన్ని విధాల కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తూ వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు జాకీర్ హుస్సేన్, కార్యదర్శులు శివ ప్రసాద్, దస్తగిరి, నరేష్, అబ్దుల్ రెహమాన్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.