బూర్జ మండలం, తోటవడా గ్రామములో ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో బూర్జ మండలం, తోటవడా గ్రామములో జనసేన పార్టీ సభ్యత్వం మరియు ఇన్సూరెన్స్ కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు దూబ సంగంనాయుడు, కొత్తకోట శ్రీను, సేపేన రమేష్, పొట్నూరు ప్రసాద్, కర్నేని రాజశేఖర్, రౌతు జగ్గారావు, వంశీ,రాజశేఖర్, చంటి, పైల జన, సి హెచ్ రాజు, సంతు, గణ మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.