*కార్యకర్తలకు పార్టీ భరోసా..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మానకొండూరు నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో జనసేన పార్టీ క్రీయాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇంచార్జ్ పడాల ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, 250 మందికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ బాండ్ మరియు ఐడి కార్డులు అందజేశారు. కార్యకర్తల కుటుంబానికి జనసేన పార్టీ అండగా నిలుస్తుందన్న ఉద్దేశంతో ఈ భద్రతా పథకం అమలు చేస్తున్నట్టు ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకరపట్నం మండల నాయకులు బాకారపు రమేష్, తిరుపతి, సంతోష్, భూష, రాకేష్, సంతోష్ కుమార్, బండపెళ్లి మారుతి గౌడ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment