సింగనమలలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

సింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో గల భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయం నందు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులకు సభ్యత్వ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. జనసేన పార్టీ, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదని జనసేన పార్టీ జిల్లా నాయకులు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్, అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, సంయుక్త కార్యదర్శి విజయమ్మ, మరియు పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ జీ.ఎర్రిస్వామి మరియు మండల నాయకులు రమేష్ తాహీర్, కుళ్లాయప్ప, వంశీ, చరణ్, హరీష్ తదితరులు పాల్గొనడం జరిగింది.