జంగారెడ్డిగూడెంలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

చింతలపూడి నియోజకవర్గం: జంగారెడ్డిగూడెంలోని స్థానిక కొత్తపేట ఆంజనేయ స్వామి గుడి వద్ద జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సభ్యత్వం పొందిన సభ్యులకు పట్టణ అధ్యక్షులు షేక్ పీరు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చింతలపూడి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ మేకా ఈశ్వరయ్య పాల్గొని సభ్యులకు సభ్యత్వం కిట్లు అందజేశారు. అయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమము కొరకు రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సభ్యత్వం పొందిన కార్యకర్తలకు ఏదేని జరగరానిది జరిగి ప్రమాదాలకు గురి అయితే 5 లక్షలు చొప్పున ఆ కుటుంబాన్నీ ఆదుకొనే విధంగా నష్ట పరిహారం ఇవ్వటానికి భీమా సౌకర్యం కల్పించారాని తెలిపారు. రానున్న కాలంలో జనసేన సభ్యత్వాలు ఎక్కువ మందికి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాలుగవ వార్డు కౌన్సిలర్ వలవల తాతజీ, చింతల నాని, బద్రి, సాయి తదితరులు పాల్గొన్నారు.