భైంసాలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ

భైంసా: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆదివారం సభ్యత్వం పొందిన జనసైనికులకు భైంసా పట్టణంలోని విశ్రాంతి భవనం నందు ఇన్సూరెన్స్ కిట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాయకులు సుంకెట మహేష్ బాబు మాట్లాడుతూ కొన్ని యేండ్ల సంవత్సరాల అనుభవం కలిగిన రాజకీయ పార్టీల్లో కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేయలేదు. కాని జనసేన పార్టీ కార్యకర్తల కోసం, అభిమానుల కోసం 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిన ఘనత మాకే దక్కింది అని గర్వంగా ఉందని కొనియాడారు. లక్షల, కోట్ల సంపాదన వుండి, సినీ రంగంలో ఎంతో విలువైన గౌరవం అభిమానం వున్నప్పటికీ కేవలం ప్రజల కోసం పరితపిస్తూ రాజకీయాల్లో కి వచ్చి సమాజం బాగు కోసం నిరంతరం కృషి చేస్తూ రైతులను, కార్మికులను, విద్య, వైద్యం, కోసం పోరాటం కొనసాగిస్తూ సినిమాల ద్వారా వచ్చే ఆదాయం నుండి స్వంత డబ్బులతో నీతి నిజాయితీ తో ముందుకు కొనసాగుతున్న ఆయన నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం చేయడానికి సిద్దంగా వున్నాం. ఆయన తప్పకుండా ఎపి లో ముఖ్యమంత్రి కావడాన్ని ఎవ్వరు ఆపలేరు. జగన్ అవినీతి పరిపాలన త్వరలోనే గద్దె దిగుతుంది. ఈ కార్యక్రమంలో అర్జున్, భీమ్ రాజ్, చంద్రకాంత్, నారాయణ్, సందీప్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.