మెరకముడిదాంలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ

చీపురుపల్లి నియోజకవర్గం: మెరకముడిదాం మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మెరకముడిదాం మండలం అధ్యక్షులు రౌతు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఆదివారం క్రియాశీలక వాలంటీర్లకు కిట్లు మరియు సాలువాలతో సన్మానించడం జరిగింది. 2024లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా అందరూ గ్రౌండ్ లెవెల్ లో పనిచేస్తామని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి తద్వారా వారి కుటుంబాలకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండి నమ్మకం కల్పించారు. మా తరుపున ప్రతేక ధన్యవాదాలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో ఆర్డినేటర్ అగురు. వినోద్ కుమార్ మరియ మండల సీనియర్ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.