పాసర్లపూడి లంక గ్రామంలో జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీ

  • జనసేన సభ్యత కిట్లను పంపిణీ చేస్తున్న మండల అధ్యక్షులు జె.యస్.ఆర్

పి గన్నవరం నియోజకవర్గం, మామిడికుదురు మండలంలోని పాసర్లపూడి లంక గ్రామంలో జె.యస్.ఆర్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగిఇంది. ఈ కార్యక్రమంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికి సభ్యత్వ కిట్లను మండల స్థానిక ఎంపీటీసీ సభ్యురాలు చెరుకూరి పార్వతి దేవికి మరియు ఇతర క్రియాశీలక సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జె.ఎస్.ఆర్ మాట్లాడుతూ సభ్యత్వం ఉన్నవారు ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు చిన్నపాటి గాయాలు అయితే 50,000 కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు తెలగారెడ్డి ఏసు, ఉపాధ్యక్షులు దొడ్డ జయరాం, పోతూ కాశీ, కంకిపాటి నరసింహ రావు, తుండూరి బుజ్జి, మద్దెమ్ శెట్టి బుజ్జి, కొమ్ముల కొండలరావు, కొమ్ముల భద్రం, కటకంశెట్టి కృష్ణ, ఇంజె రవి, కాట్రేనిపాడు నాగేంద్ర, బొరుసు బాబీ, కొమ్ముల రాము,బొంతు సుధాకర్, బొంతు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.