జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

నూజివీడు: అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణంలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం ముఖ్యఅతిథిగా నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు బర్మా ఫణిబాబు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. నూజివీడు సీనియర్ రాజకీయ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు గృహము నందు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మరణించిన క్రియాశీలక కార్యకర్తలను స్మరిస్తూ మౌనం పాటించి నివాళులు అర్పించి అనంతరం నియోజకవర్గ నాయకులు బర్మా ఫణి బాబు చేతుల మీదుగా నియోజకవర్గంలోనే అత్యధికంగా 423 సభ్యత్వాలు చేసిన పాశం నాగబాబును సన్మానించడంతో పాటు పట్టణ నాయకులు తోట వెంకట్రావు, సూరిసెట్టీ శివ, ఏనుగుల చక్రి, తొమ్మండ్రు అశోక్ లను జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో సత్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ ముందు కార్యకర్తల సంక్షేమం కోసం పెట్టిన ఇ ఇన్సూరెన్స్ తో కూడిన సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశంలోనే గొప్పదని కొనియాడారు. అనంతరం కిట్లు పంపిణీ చేసి బర్మా ఫణి బాబు మాట్లాడుతూ జనసేన నాయకులు, కార్యకర్తలు రాబోయే రోజుల్లో నూజివీడులో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీనియర్ నాయకులు ఏనుగుల వెంకటేశ్వరరావు, కాపు సంక్షేమ సేన నూజివీడు టౌన్ నాయకులు సింగంశెట్టి బాలకోటయ్య, తిరుమల శెట్టి మల్లికార్జున రావు, నాగేశ్వరరావు, నూజివీడు జనసేన నాయకులు తోట వెంకటరావు, పాశం నాగబాబు, సూరిశెట్టి శివ, ఏనుగుల చక్రి, నాయుడు కిషోర్, గొల్లపల్లి శ్రీకాంత్, పసుపులేటి బంగారయ్య, గొల్లపల్లి గిరి, దద్దనాల శివ, మండా శివరామకృష్ణ, కుండేటి.వీరాంజనేయులు, జ్యోతులశివ, షేక్ దాదా, షేక్ హుస్సేన్, సయ్యద్ ఇమ్రాన్, బావిశెట్టి వీరయ్య, ఏనుగుల శ్రీకాంత్, ఏనుగుల కిషోర్, మేకల అమర్నాథ్, హరీష్, కడియం శ్రీను, నలా.అశోక్ కుమార్, మరియు నూజివీడు రూరల్ వైస్ ప్రెసిడెంట్ తొమ్మంద్రు అశోక్ కుమార్, షేక్ బిలాల్, అనిల్ పండు, గిరి సురేంద్ర, మంతెన కళ్యాణ్, నాయుడు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.