మడకశిరలో అట్టహాసంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

మడకశిర: జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి మరియు జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ సూచనలతో మడకశిరనియోజకవర్గం (మడకశిరమండలం, పట్టణం) లోని క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన వాలంటీర్లను ఘనంగా సత్కరించి.. క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శులు రామాంజనేయులు, ప్రత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేయాలని.. పార్టీ సిద్ధాంతాలు నిస్వార్ధంగా కష్టపడే జనసైనికులు అందరిని గుర్తించేలా.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఆలోచన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కృషి చేయాలని అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐటీ విభాగం కోఆర్డినేటర్ టి. ప్రసాద్
మండల అధ్యక్షుడు టి. ఏ శివాజీ, ఉపాధ్యక్షులు కళ్యాణ్, యశ్వంత్, ప్రధాన కార్యదర్శులు శ్రీహరి, సుధాకర్, శ్రీనివాసులు, రంగనాథ, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, మండల కమిటీ నాయకులు, నిస్వార్ధమైన జనసైనికులు, పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.