రామసముద్రం మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి చిత్తూరు జిల్లా, మదనపల్లె నియోజకవర్గo, రామసముద్రం మండలంలో చెంబకూరు వాసవి కళ్యాణ్ మండపంలో జనసేన రామసముద్రం మండల అధ్యక్షుడు హోసూరు చంద్రశేఖర్ అదక్షతన వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ బీమా పత్రాలు కార్యకర్తలకి అందచేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో సభ్యత్వాలు చేసిన వాలంటీర్సకి అనగా హోసురు చంద్రశేఖర్, ఒంటిళ్లు సికిందర్, గెడ్డం లక్ష్మీపతి, చెక్కిళ్ళ విశ్వనాథ, రాము వీరిని ముఖ్యఅథిదులుగా విచ్చేసిన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి, చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపు లేటి హరిప్రసాద్, రాష్ట్ర కో-ఆర్డినేటర్ పగడాల మురళి, తిరుపతి ఉపాద్యక్షులు ఆనంద్, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం వీరిని దుశ్శాలవతో మరియు పూల హారముతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మదనపల్లె రూరల్ అధ్యక్షుడు రోనురి బాబు లక్ష్మినారాయన రెద్దమ్మ క్రాంతి బంగారం, నగరాజ్, చందు, విజయ్, మదనపల్లె ఐటీ కోఆర్డినేటర్ రాజేష్ కుమార్, జలకుమార్ పాల్గొన్నారు.