పెనుమంట్ర లో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పెనుమంట్ర: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు.. ఆచంట నియోజకవర్గం ఇంచార్జ్ పీఏసీ మెంబర్ చేగొండి సూర్యప్రకాష్ సూచనల మేరకు.. పెనుమంట్ర మండల అధ్యక్షులు కోయ వెంకట కార్తీక్ అధ్యక్షతన పెనుమంట్ర గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్స్ కి చిరు సత్కార కార్యక్రమం చేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మనోగతాన్ని వివరించి.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, మిగతా 3 మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పెనుమంట్ర మండల కమిటీ సభ్యులు, గ్రామ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్స్ జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.