సాకుర్రులో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

అమలాపురం నియోజకవర్గం: అమలాపురం రూరల్ మండలం, సాకుర్రు గ్రామంలో జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లను గ్రామ పెద్దలు పిలుపు మేరకు నియోజక వర్గ నాయకులు లింగోలు పండు ఆధ్వర్యంలో ఇంటింటికీ అందజేశారు. ఈ సందర్భంగా పండు మాట్లాడుతూ.. దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని ప్రమాద బీమా సభ్యత్వ నమోదు ప్రక్రియను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టడం అభినందనీయమని రాబోయే 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతిఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పండు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా వెంకటేశ్వరరావు, కరిముల్ల బాబా, పాలూరి నారాయణ స్వామి, వాకపల్లి వెంకటేశ్వరరావు, డి.ఎస్.ఎన్ కుమార్, కొప్పుల నాగ మానస, నిమ్మకాయల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.