తాడిపత్రిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

అనంతపురం జిల్లా, తాడిపత్రి నియోజకవర్గం, జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం తాడిపత్రి నియోజకవర్గంలోని తాడిపత్రి రూరల్ ఏరియాలో క్రియాశీలక సభ్యత్వం చేయించకుకున్న వారికి తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఇన్సూరెన్స్ కిట్లను ప్రధానం చేయడం జరిగింది. అనంతరం పవన్ కళ్యాణ్ మనోగత ప్రతిని చదివి క్రియాశీలక సభ్యత్వం గురించి కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది.