డొంకల పర్త గ్రామంలో జనసేన క్యాలెండర్ ల పంపిణీ

ఆమదాలవలస నియోజకవర్గం, బూర్జ మండలంలోని డొంకల పర్త గ్రామంలో నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు పిలుపుతో బూర్జ మండల నాయకులు మజ్జి రాంబాబు, తోట అప్పలరాజు ల ఆధ్వర్యంలో గురువారం జనసేన క్యాలెండర్ లను ప్రతి ఇంటింటికి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేత సాయికుమార్, అనుసూరి మన్మధరావు అలాగే డొంకల పర్త గ్రామం నాయకులు నరసింహ, రాంబాబు, మనోజ్, తవిటి నాయుడు, సాయి, మిన్నారావు, విజయకృష్ణ, లక్షణ, అనంతరావు అలాగే గ్రామస్తులందరూ చాలా హుషారుగా పాల్గొనడం జరిగింది.