గుట్లపాడులో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

భీమవరం మండలం గుట్లపాడు గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యత్వ కిట్లను స్వయంగా అందజేస్తూ, పార్టీ పట్ల వారి నిబద్ధతకు గుర్తింపునిస్తూ నాయకులు ప్రతి ఒక్కరిని అభినందించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల విశ్వాసంతో జనసైనికులు ప్రజల మద్ధతుతో ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం క్రియాశీలక శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Share this content:

Post Comment