విద్యార్థులకు లెటర్ ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్ పంపిణీ

కదిరి, రామ్ చరణ్ పుట్టిన రోజు వారోత్సవాలలో భాగంగా కదిరి మండలం కొండమనాయిని పాళ్యం జడ్.పి.హెచ్ ప్రభుత్వ పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు లెటర్ ప్యాడ్స్, పెన్స్, స్కేల్స్, కదిరి పట్టణంలో వృద్దులకు (యాచకులకు) చీరల పంపిణీ రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ అధ్యక్షులు మనోహర్ ఆదర్యంలో పంపిణీ చెయ్యడం జరిగింది. పరీక్షలు రాస్తున్న విద్యార్థి, విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ఉత్తమమైన ర్యాంకులు సాధించి చదువు నేర్పిన గురువులు, పాఠశాలకు మంచి పేరు తీసుకొని రావాలని స్కూల్ హెడ్ మాస్టర్, స్కూల్ స్టాఫ్, అధ్యక్షులు మనోహర్, లక్ష్మణ కుటాల ఆకాంక్షిస్తూ విద్యార్థుల అందరి తరపున మెగా తనయుడు మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా సీనియర్ అభిమానులు మనోహర్ , సుధాకర్ మరియు మన టీమ్ సభ్యులు హరీష్ వాల్మీకి, రాజేంద్ర, హరిబాబు, ఆకుల హరి ప్రసాద్, మల్లెల శరత్, నాగరాజు, గొందిపల్లి రవి కుమార్, సోమశేఖర్, నవీన్ భక్కసం, కుంటిమద్ది సోమశేఖర్, కార్తిక్, హరీష్ వాల్మీకి, నందిశెట్టి బాబు తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.