*నరసాపురంలో సుబ్బారెడ్డి హర్షం
నరసాపురం నియోజకవర్గంలోని లక్ష్మనేశ్వరం గ్రామంలో ఏరువాక పౌర్ణమిని పురస్కరించుకుని రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం (ఆర్.కె.వి.వై) ద్వారా యంత్రపరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకురాలు శ్రీమతి ఈ.అనిల్ కుమారి అధ్యక్షత వహించారు. ఎరువాక పౌర్ణమి పండుగ రైతులకి ఎంతో ప్రాముఖ్యమైందని, తొలి వానలతో ఊరంతా సేద్యం జోరందుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్బంగా నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని రైతులకు రూ. 14,32,810 విలువ గల కృషి టాక్టర్లు, రోటావేటర్లు, లెవలింగ్ బ్లేడ్‌లు, పవర్ స్ప్రేయర్లు, బ్యాటరీ స్ప్రేయర్లు వంటి వ్యవసాయ యంత్రాలను 33 మంది రైతులకు సబ్సిడీపై పంపిణీ చేశారు. ఇంకా, అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల కింద రైతు కుటుంబానికి రూ. 20,000 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేయనుండటం వల్ల, రైతులు తమ కె.వై.సి నమోదు తప్పక రైతు సేవా కేంద్రాల్లో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ఎం.షరీఫ్, టిడిపి ఇంచార్జ్ పొత్తూరు రామరాజు, నీటి సంఘం ప్రాజెక్ట్ వైస్ చైర్మన్ గుబ్బల మారాజు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, మైల వసంతరావు, కొల్లు పెద్దిరాజు, వాతాడి ఉమామహేశ్వరరావు, వాతాడి కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎన్డీఏ కూటమి ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this content:
Post Comment