జనసేన పార్టీ ఆధ్వర్యంలో మందులు పంపిణీ

నంద్యాల, మహా శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని జనసేన పార్టీ తరఫున సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న వైద్య శిబిరానికి ఔషధాలను విరాళంగా అందజేసినట్లు నంద్యాల జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్, సెవెన్ హిల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ భాగస్వామీ జనసేన నాయకులు సుధా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ సమాజసేవ, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతున్న సందర్భంలో, ఈ వైద్య సేవా కార్యక్రమం ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఎంతో తోడ్పడుతుందని జనసేన నంద్యాల సమన్వయకర్త పిడతల సుధాకర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి, కమిటీ సభ్యులు ఉస్మాన్ బాషా, జనసేన కార్యకర్తలు వెంకటేష్, సందీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment