కళ్యాణదుర్గం నియోజకవర్గం క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు పంపిణీ

కళ్యాణదుర్గం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ బాల్యం రాజేష్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. క్రియాశీలక కార్యకర్తలకు సభ్యత్వ కిట్లను పంపిణీ చేసి జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సభ్యులకు ఏదైనా జరిగితే ఆర్థికంగా అండగా ఉండేలా రూపొందించిందే క్రియాశీలక సభ్యత్వం అని అన్నారు. గడచిన రెండేళ్ళలో ప్రమాదానికి గురైన కార్యకర్తలకు 50వేల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణించిన కార్యకర్తల కుటుంబాలకు 5₹ లక్షల రూపాయలు అందిస్తూ పార్టీ తోడుగా నిలవడం జరిగిందన్నారు. పార్టీ సభ్యులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలవాలని, కార్యకర్తల ఇంట్లో కుటుంబసభ్యునిగా మమేకం అవ్వాలని పవన్ కళ్యాణ్ నిత్యం తమకు చెప్తుంటారని వివరించారు. ప్రతి కార్యకర్త సంక్షేమానికి తోడుగా ఉంటున్నామని, సమస్యలు ఏర్పడినపుడు అండగా నిలుస్తామని, అక్రమ కేసులు బనాయిస్తే పోలీసు స్టేషన్ల ఎదుట పోరాడిన సందర్భాలు ఉన్నాయని, కోర్టులో న్యాయ పోరాటాలు చేసిన సందర్భాలు ఉన్నాయని కొన్ని ఉదాహరణలను కార్యకర్తలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని, మనవంతుగా మనం ఆ దిశగా ప్రజల వైపు, ప్రజా సమస్యల పరిష్కారం వైపు బలంగా నిలబడితే చాలు అని క్రియాశీలక కార్యకర్తలకు సూచించారు. రానున్న మంచి రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఉరకలెత్తే ఉత్సాహంతో ప్రతి ఒక్కరం పని చేద్దాం అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సయ్యద్, గోవిందు అరవింద్ దిలీప్ మహేష్ మొదలైన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.