మైలార లింగేరశ్వర స్వామి ఆలయానికి మైక్ సెట్ వితరణ

పెనుకొండ నియోజకవర్గం, పెనుకొండ మండలం, రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన మైలార లింగేరశ్వర స్వామి ఆలయానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్ నిధులతో నియోజకవర్గం నాయకులు కుమార్ ఆధ్వర్యంలో మైక్ సెట్ ను ఆలయ కమిటీ సభ్యులకు మరియు గ్రామ పెద్దలకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెనుకొండ మండల అధ్యక్షులు మహేష్, నాయకులు బంగారం, రాజేష్, ఉపాధ్యక్షులు మంజునాథ్ మరియు గ్రామ పెద్దలు మైలప్ప, నాగరాజప్ప, అక్కులప్ప, అంజప్ప, రామాంజి, మల్లయ్య, ఓబులేశప్ప తదితరులు పాల్గొన్నారు.