రామ్ చరణ్ జన్మదిన వేడుకలలో భాగంగా దివ్యాంగులకు నిత్యావసరాల పంపిణీ

తాడిపత్రి, విశ్వ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ కొణిదెల రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి, రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 34 వార్డులో ఉన్నటువంటి దివ్యాంగుల కాలనీలో ఉన్న దివ్యాంగులకు నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను టీమ్ సభ్యుల సహకారంతో అందించడం జరిగింది. మెగా కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రతి సంవత్సరం వారి వారి పుట్టినరోజులను గుర్తు ఉండిపోయేలా ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఆ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా పేదల కళ్ళల్లో ఆనందం కోసం సోమవారం వారికి టీమ్ సభ్యుల తరపున ఈ చిన్న సేవా కార్యక్రమం చేసాము. కొణిదెల రామ్ చరణ్ నిండు నూరేళ్లూ సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని టీమ్ వ్యవస్థాపకులు కడపల సుధాకర్ రెడ్డి, అధ్యక్షులు మనోహర్, లక్ష్మణ కుటాల తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్ర శేఖర్, హరి బాబు, చక్రి, కార్తిక్, హరీష్ వాల్మీకి, రాజశేఖర్, రాజ, నందిశెట్టి బాబు, రాజేంద్ర, లోకేష్, గణేష్, కుప్పాల రాజేష్, అన్నం జయవర్ధన్, మను, నరసింహులు, సుదర్శన్ తదితర మెగా అభిమానులు పాల్గొన్నారు.