సబ్సిడీపై పవర్ టిల్లర్‌ల పంపిణీ

తెలుగుదేశం – జనసేన – భాజపా కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉండే “రైతు నేస్తం” ప్రభుత్వంగా కొనసాగుతోంది. పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు పి.గన్నవరం, అంబాజీపేట, మామిడికుదురు మండలాలకు సంబంధించిన లబ్ధిదారులకు పి.గన్నవరం అగ్రికల్చర్ కార్యాలయంలో జరిగిన సబ్సిడీపై పవర్ టిల్లర్‌ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, మెకానికల్ పరికరాల వినియోగం పెరిగితే రైతుల ఆదాయం మెరుగవుతుందనే ఉద్దేశంతో సబ్సిడీపై పవర్ టిల్లర్‌లను అందజేస్తున్నామని తెలిపారు. రైతులకు పెట్టుబడి భారం తగ్గించి అధిక దిగుబడి సాధించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మొత్తం 11 మంది రైతులు లబ్ధిదారులుగా ఎంపికయ్యారు. ఒక్కో పవర్ టిల్లర్ ధర ₹2,29,500 కాగా, అందులో ప్రభుత్వం ₹1,00,000 సబ్సిడీగా మంజూరు చేసి, రైతు వాటాగా ₹1,29,500 వేశారు. మొత్తం టిల్లర్, కట్టర్, స్పియర్ ఖర్చు ₹25,54,120 కాగా, ప్రభుత్వం అందించిన మొత్తం సబ్సిడీ ₹11,14,515. కార్యక్రమంలో వ్యవసాయశాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment