రైతులకు ఎలుకల మందు పంపిణీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం, మూలస్థాన అగ్రహారం గ్రామం నందు పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం అగ్రికల్చర్ అధికారులు రైతులకు వరి నాట్లలో ఎలుకల నివారణకు ఎలుకల మందును పంపిణీ చేసి రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో మూలస్థాన అగ్రహారం గ్రామ సర్పంచ్ లంక వరప్రసాద్, పంచాయతీ పాలకవర్గం సభ్యులు, పంచాయతీ సిబ్బంది ఎంపీటీసీ సభ్యులు, వ్యవసాయ అధికారులు, జనసేన సీనియర్ నాయకులు సలాది జయ ప్రకాశ్ నారాయణ (జెపి) తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ అధికారులు చూసిన మేరకు వరి పంట పొలాలలో రైతులు ఎలకల బెడదను తక్షణము నిర్మూలించుకోవాలని, ఎలకలు పొలం గట్ల పైన, వరిచేలలోను వరి నాట్లను నాశనం చేయకుండా ఉండేందుకు తగు చర్యలు రైతులు వెంటనే తీసుకోవాలని పలు సూచనలతో వ్యవసాయ అధికారులు తెలియజేశారు. రైతులకు వరి నూకలతో కలిపిన ఎలుకల మందుని పంపిణీ చేశారు. తప్పకుండా ఎలుకలను నివారణకు తగు సూచనలు పాటిస్తే దిగుబడి అధికంగా ఉంటుందని, ఏ మాత్రం ఆజాగ్రత్త చేసిన ఎలుకలు కష్టపడి పండించిన పంటను సర్వము నాశనం చేస్తాయని, ఎలుకలను నివారించుట ఒక్కటే మార్గమని తగు సూచనలతో అధికారులు ఈ సమావేశంను నిర్వహించారు.