గిరిజనులకు చీరలు పంపిణీ..!

సర్వేపల్లి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో, సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ గిరిజన కాలనీ నందు జనసేన పార్టీ ఆధ్వర్యంలో సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు అధ్యక్షతన, వీరమహిళ గుమ్మినేని వాణి భవాని ఆధ్వర్యంలో గిరిజనులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. “ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో, అక్కడే ఆ ప్రాంతం మొత్తం సుభిక్షంగా ఉంటుంది” అనేది మన చరిత్ర. జనసేన పార్టీ మహిళల కోసం, మహిళలకు రాజకీయాల్లో సమితి స్థానం కల్పించే విధంగా వీర మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి, పవన్ కళ్యాణ్ మహిళలను ఎంతో గౌరవించే విధంగా తన నాయకత్వం కనపరచారు. స్వాతంత్రం కోసం నడుం బిగించి, అడుగు ముందుకు వేసిన వారిలో వీర మహిళలు ప్రధాన పాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో సందూరి శ్రీహరి, ముత్తుకూరు మండల నాయకులు అశోక్, మస్తాన్, రహమాన్, చిన్న తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment