పుట్టపర్తిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, కొత్తచెరువు మండలంలో మండల అధ్యక్షులు పూల శివప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యాలయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్బంగా బైక్ ర్యాలీ ద్వారా ఘన స్వాగతం పలికి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్తచెరువులో పార్టీ ఐడి కార్డులను మరియు కిట్లను విడుదల చేసి పంపిణీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మండలంలో క్రియాశీలకంగా అత్యధికంగా సభ్యత్వ నమోదు చేయించిన మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ ని, బాలినేని గంగాద్రి, జనార్ధన్, పేట రాము, పసల లోకనాథ్ లను సన్మానించడం జరిగింది. చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయంని ఏర్పాటు చేశారని మండల అధ్యక్షులు పూల శివ ప్రసాద్ ని అభినందించారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కార్యకర్తల భరోసా కోసం ఏర్పాటు చేసిన 5 లక్షల ప్రమాద బీమా కలిగిన ఈ క్రియాశీలక సభ్యత్వాలు సద్వినియోగం చేసుకోని అధికంగా చేసినందుకు అభినందించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రజల ఆదరణ పొందుతున్నది వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. ఈ వైసీపి అరాచకపు పాలన ప్రజలు అందరూ ఏకమై దించేయాలని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏకం చేసి జనసేన పార్టీని అధికారంలోకి తెచ్చి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలి అని కోరారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్, కార్యదర్శి బొగ్గరం శ్రీనివాసులు విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తచెరువు మండల నాయకులు పూల వెంకటేశు, పసుపులేటి సూర్యనారాయణ, గుడ మధు, పూల రెడ్డప్ప, ముత్త నరేంద్ర, గూడా శ్రీనివాసులు, దొడ్డిగుంట నరేంద్ర, సొలంకల రాజు, అలుగుంటి శేఖర్, ప్రవీణ్, రఘుపతి, గంగాద్రి, చింతలప్ప, హనుమంతు నాయక్, ఆర్కేసి మారుతి, రామ శివ, బాలాజీ, మల్లేష్, చింతల, ప్రసాద్, బోయ నాగమణి, ప్రమీల, నియోజకవర్గ 6 మండలాల నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.