వై శ్రీనివాస్ ఆధ్యర్యంలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*రాజమహేంద్రవరం జనసేన అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆధ్యర్యంలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 10,11,12 వ తేదీల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణి కార్యక్రమం ఘనంగా ప్రారంభం అయింది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాల్లో వివిధ వార్డ్ ల్లో ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజమహేంద్రవరం మున్సిపల్ అధ్యక్షులు వై.శ్రీనివాస్ చేతుల మీదుగా స్ధానిక 22 వ వార్డ్ లో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తేజోమూర్తుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో 80 మంది పురోహితులకు, 43 వ వార్డ్ గౌరీశెట్టి చైతన్య కుమార్, పేశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో 111 మందికి, 14 వ వార్డ్ యందం ఇందిరా గారి ఆధ్వర్యంలో సుమారు 60 మందికి, 9 వ వార్డ్ చౌకొండ మురళీ ఆధ్వర్యంలో 45 మందికి, మొత్తంగా రాజమండ్రి నగరంలో వందలాది మందికి వై.శ్రీనివాస్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వ ఐ డి కార్డ్ లు, 5 లక్షల ఇన్స్యూరెన్స్ పత్రాలతో కూడిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి ఘనంగా నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమాలకు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తేజోమూర్తుల నరసింహమూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాధరావు, నగర కార్యదర్శి కప్పల సూర్య ప్రకాష్, ముమ్ముడి నాగరాజు, సోము హాజరైయ్యారు.