విద్యార్థులకు విద్యా మిత్ర కిట్‌ల పంపిణీ

*కూటమి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సంకల్పం

కొవ్వూరు నియోజకవర్గంలోని ఐ.పంగిడి హైస్కూల్‌లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగ్, యూనిఫాం, బెల్ట్, టై, షూస్ కిట్లు అందజేసింది. ప్రధానోపాధ్యాయులు రామారావు నేతృత్వంలో, స్కూల్ చైర్మన్ కారింకి వెంకట లక్ష్మి, వైస్ చైర్మన్ జనసేన నాయకుడు పెరుగు శివ చేతుల మీదుగా ఈ పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా హెచ్‌ఎం రామారావు మాట్లాడుతూ, జూలై 10వ తారీఖు నాటికి విద్యార్థులు అందరూ కొత్త యూనిఫాం కుట్టించుకుని, పాఠశాలకు క్రమశిక్షణతో హాజరవాలని సూచించారు. వైస్ చైర్మన్ పెరుగు శివ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం ప్రవేశపెట్టబడిందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించాలని కోరారు.

Share this content:

Post Comment