దివీస్‌ ఉద్యమ అభ్యర్థి సుధాకర్‌ గెలుపు

తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటిమామిడి పంచాయతీ సర్పంచ్‌గా అంగులూరి సుధాకర్‌ విజయం సాధించారు. సిపిఎం మద్దతుతో దివీస్‌ పోరాట కమిటీ అభ్యర్థిగా ఆయన పంచాయతీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. వైసిపి మద్దతుదారుపై ఆయన 113 ఓట్లతో గెలుపొందారు. ఇటీవల జరిగిన దివీస్‌ పోరాటంలో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఎంబిఎ చదివారు. కాలుష్యకారక దివీస్‌ నుంచి గ్రామాలను రక్షించుకోవాలనే ఆశయంతో ఆయన సర్పంచ్‌ బరిలో నిలిచారు. ఆయన్ని సిపిఎం కాకినాడ జిల్లా కార్యదర్శి కెఎస్‌.శ్రీనివాస్‌ తదితరులు అభినందించారు.