మెగాఫ్యామిలీతో బన్నీ సందడి.. వైభవంగా దీపావళి వేడుకలు

‘హ్యాపీ దీపావ‌ళి’ అంటూ సినీన‌టుడు అల్లు అర్జున్ పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల‌ను అల‌రిస్తోంది. గ‌తంలో మెగా కుటుంబ స‌భ్యులు పండుగ సంద‌ర్భంగా పోస్ట్ చేసిన ఓ ఫొటోలో అల్లు అర్జున్ క‌న‌ప‌డ‌లేదు. దీంతో అప్ప‌ట్లో బ‌న్నీ అభిమానులు నిరాశ చెందారు. ఈ సారి బ‌న్నీయే స్వ‌యంగా ఓ ఫొటో పోస్ట్ చేశాడు.

ఈ ఫొటోలో అల్లు అర్జున్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్, వైష్ణవ్ తేజ్, బాబీ, నిహారిక‌, చైత‌న్య‌, వైష్ణ‌వ్ తేజ్ తో పాటు ప‌లువురు ఉన్నారు. దీపావ‌ళి సంద‌ర్భంగానే వీరంతా క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఫొటోలో మ‌రో యంగ్ హీరో సాయి తేజ్ మాత్రం క‌న‌ప‌డ‌డం లేదు. ఆయ‌న‌కు యాక్సిడెంట్ అవ్వ‌గా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని, ఇంటికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌స్తుతం ఆయ‌న విశ్రాంతి తీసుకుంటున్నాడు.

కాగా, అల్లు అర్జున్ న‌టించిన‌ పుష్ప సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అలాగే, చెర్రీ న‌టించిన ఆర్ఆర్ఆర్ కూడా విడుద‌ల‌కు ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే, ఆయ‌న శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాలో న‌టిస్తున్నాడు.