జనసేన తరపున దీపావళి కానుక పంపిణీ

  • ఆల్ కర్ణాటక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల సేవా సంఘం మరియు సహాయ సంఘం తుమకూరు జిల్లా పావగడ తాలూకాలో జనసేన తరపున దీపావళి కానుక పంపిణీ

కర్ణాటక: పావగడ సమీపంలోని దిన్నె బెట్ట తండా వాసులకు ఆదివారం జనసేన తరపున దీపావళి పండుగ కిట్లను హెల్ప్ సొసైటీ అధ్యక్షుడు మానం శశికిరణ్ పంపిణీ చేశారు. ఈ దీపావళి పండుగకు ప్రత్యేక బహుమతులు అందజేశామని, అందరూ సమానంగా పండుగను జరుపుకోవాలని అన్నారు. సొసైటీ అధ్యక్షుడి సహకారం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ముక్త కంఠంతో సహాయ సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. కార్యక్రమంలో హెల్ప్ సొసైటీ ఆఫీస్ బేరర్లు వెంకటేష్ నాయక్, సాగర్, సాయి కుమార్, నరేష్ యాదవ్, గ్రామస్తులు పాల్గొన్నారు.