నల్లా నరసింహారావు కుటుంబ సభ్యులను పరామర్శించిన డి.ఎం.ఆర్ శేఖర్

అమలాపురం: వానపల్లి పాలెం గ్రామానికి చెందిన నల్లా నరసింహారావు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని అమలాపురం జనసేన పార్లమెంటరీ ఇంఛార్జి డి.ఎం.ఆర్ శేఖర్ పరామర్శించారు. శేఖర్ గారు నరసింహారావు కుటుంబ సభ్యులైన నల్లా సత్తిబాబుతో మరణానికి గల కారణాలు తెలుసుకున్నారు. నరసింహారావు గారు మన మధ్య లేకపోతే వానపల్లిపాలెం గ్రామానికి తీరనిలోటు అనే ఆయన అన్నారు. జనసేన అమలాపురం పార్లమెంట్ ఇంచార్జ్ డిఎంఆర్ శేఖర్ తో పాటు జనసేన పార్టీ మండల అద్యక్షులు ఆకుల సూర్యనారాయణ మూర్తి, జనసేన నాయకులు ఆర్ డి ఎస్ ప్రసాద్, గంగాబత్తుల కిషోర్, పోలిశెట్టి కన్నా, సత్తి చిన్నా, నల్లా శ్రీను, నల్లా బాలు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.