మనోభావాలు దెబ్బతినేలా ఉన్న ఫ్లెక్సీ లను తొలగించాలి: జనసేన డిమాండ్

  • ఎస్ఐ మరియు పంచాయితీ సెక్రెటరీ లను కలిసిన జనసేన కనపర్తి మనోజ్ కుమార్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో వైసిపి నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి, జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా, అవమానకరంగా, జనసేన నాయకులు, కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే విధంగా, అల్లర్లు గొడవలు సృష్టించే విధంగా ఉన్నాయి. వెంటనే ఆ ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ బుధవారం ఎస్ఐ గారిని మరియు పంచాయతీ సెక్రెటరీని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐయినాబత్తిన రాజేష్, సుబ్రహ్మణ్యం నాయుడు, కర్ణ తిరుమలరెడ్డి, మహబూబ్ బాషా, పిల్లిపోగు పీటర్, పెయ్యల రవి, సుంకేశ్వరం శ్రీను, సాయి, ఖాదర్ బాషా, భార్గవ్, మహేంద్ర, రామాంజనేయులు, మరియు వీరమహిళలు పాల్గొన్నారు.