ప్రజా ప్రతినిధులకు గిరిజన వైద్య అధ్వాన స్థితి పట్టదా..?

  • గిరిజన ప్రాంతంలో ప్రజారోగ్యానికి రక్షణ కరువైంది
  • సెల్ ఫోన్స్ వెలుతురుతో కూడా వైద్యం చేస్తారా?
  • గిరిజన ప్రజల వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా?
  • ఈ పరిస్థితికి కారణం జగనన్న విద్యుత్ కోతలు కారణమా?
  • జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య

పాడేరు: చింతపల్లి మండలంలో గల లోతుగెడ్డ ప్రాధమిక ఆస్పత్రిలో అందుబాటులో అత్యద్భుతమైన కొత్త సాంకేతికతతో కూడిన వైద్యవిధానం. ఏజెన్సీ ప్రాంతంలో అందని ద్రాక్షగా కొనసాగుతున్న వైద్యం, అరకొరవసతులు, మందులు లేని దుస్థితి, సిబ్బందికొరత, ఆఖరికి కరెంట్ లేని పరిస్థితుల్లో సెల్ పోన్ వెలుతురులో చికిత్స చేస్తున్న ఇలాంటి సంఘటనలు చూస్తుంటే గిరిజన ప్రాంతంలో ప్రజారోగ్యానికి రక్షణ కరువైన సందర్భాలు ఏజెన్సీ ప్రాంతంలో కొనసాగుతోంది. ఇప్పటికైనా గిరిజనప్రజాలపై కక్ష్యపూరిత వైఖరి అవలంబించే విధానాలకు స్వస్తి పలికి మెరుగైన చికిత్సలకు అవసరమైన చర్యలు చేపట్టాలని, జనసేన పార్టీ ద్వారా జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. వంపురు గంగులయ్య డిమాండ్ చేసారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం రాత్రి సుమారు 6.30 గంటల సమయంలో లింగలగుడి గ్రామ గిరిజనుడు గుంట గాసికి హఠాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. దీంతో స్పందించిన కుటుంబ సభ్యులు, గ్రామయువత సహాయంతో లోతుగెడ్డ ప్రాధమిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి విద్యుత్ సరఫరా లేదు, కేవలం సెల్ ఫోన్ వెలుతురు తోనే ప్రాధమిక చికిత్స చేయడం చీకట్లో ఏమి జరుగుతుందో ఎమోనని భయం భయంగా గడిపారు గాసి కుటింబీకులు. స్పందించిన వైద్యులు సరైన వైద్యం చేస్తారేమో అనుకుంటే నిజానికి అక్కడ ప్రధాన వైద్యులు ఎవరూ కూడా అందుబాటులో లేరని తెలిసింది. కేవలం ఆ సమయంలో ఇద్దరు స్టాప్ నర్సులు మాత్రమే ఉండడం గాసి కుటుంబ సభ్యులకు ఆందోళన మొదలయ్యింది. ఎలాగొలా చాలా సమయం తర్వాత వైద్యం ప్రారంభించారు. కానీ అక్కడ ఆస్పత్రి పరిస్థితులు పరిశీలిస్తే ప్రధాన వైద్యులు స్థానికంగా లేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గిరిజనులకు విద్య, వైద్యం, అభివృద్ధి అంటూ ఊదరగొట్టే ఊకదంపుడు ప్రసంగాలు, జగనన్నతోనే అభివృద్ధి అంటు గొంతెత్తి చాటే మన ప్రజాప్రతినిధులకు గిరిజన వైద్య అద్వానస్థితి పట్టదా?. సెల్ ఫోన్స్ వెలుతురుతో కూడా వైద్యం చేస్తారా?. గిరిజన ప్రజల వైద్యానికి ఇచ్చే ప్రాధాన్యత ఇదేనా?. ఈ పరిస్థితికి కారణం జగనన్న విద్యుత్ కోతలు కారణమా?. లేక ఆస్పత్రికి విద్యుత్ సరఫరా విషయంలో కనీసం ఒక జనరేటర్ కూడా ఏర్పాటు చేయని నిర్లక్ష్యం కారణమా?. ప్రజాప్రతినిధులకు నిజంగానే గిరిజన వైద్యవిధానంపై శిత్తశుద్ధి ఉందా లేదా..? అనే సందేహం సర్వత్రా గిరిజనప్రజలకు కలుగుతోంది. మొదటగా ఆస్పత్రికి నియమించిన వైధ్యాధికారులు డాక్టర్ లక్ష్మీ కాంత్ ఎం.బి.బి.ఎస్, డాక్టర్ జానకి ఎం.బి.బి.ఎస్ వంటి వైద్యులు ఉన్నప్పటికీ ఇద్దరిలో ఒక్కరు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరం. విధినిర్వహణలో వైద్యాధికారుల తీరు ఎలా వుందో చూడాల్సిన బాధ్యత మన ప్రజాప్రతినిధులదే. కానీ ఆ ఆలోచన మన ప్రజాప్రతినిధులకు ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితి. ఇది గిరిజన ప్రజల వైద్యానికి స్పందించే ప్రభుత్వవిధానానికి ఇటువంటి సంఘటనలు అద్దముపడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తగిన ఏర్పాట్లు లోతుగెడ్డ ఆస్పత్రికి కల్పిస్తే మంచిది. లేకుంటే ఇది కచ్చితంగా ప్రభుత్వం గిరిజనులపై వహించే నిర్లక్ష్యమేననుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందేనని డా. వంపురు గంగులయ్య తెలిపారు.