ఏం అర్హతతో పవన్ కళ్యాణ్ ను విమర్శించావు?

*కొరముట్ల శ్రీనివాసులును సూటిగా ప్రశ్నించిన తాతంశెట్టి నాగేంద్ర

ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి మీ మతిభ్రమించిందా, కుయ్ కుయ్యమనే సైరన్ పోవడంతో నీవు ఏం చేస్తున్నావు అర్థం కావడం లేదా అంటూ.. జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సూటిగా ప్రశ్నించారు. గురువారం మండల కేంద్రమైన చిట్వేలి జనసేన కార్యాలయంలో జనసేన మండల నాయకుడు మదాసు నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల ఓబులవారిపల్లి మండలం వై కోట సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఏనుగుల దాడి ఘటనపై కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడిన తీరును ఆయన తప్పు పట్టారు. ప్రభుత్వ తప్పిదం వల్లే ఏనుగులు సంచరించాయన్నడం విజ్ఞత కోల్పోయి మాట్లాడడమేనన్నారు. ఏనుగులు వాటి ఇష్టమైన చోట సంచరిస్తాయని అది ప్రభుత్వ తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఎక్స్గ్రేషియాను బాధిత కుటుంబాలకు అందించిన ఘనత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి దక్కుతుందని. ఆ విషయంలో వైసిపి నాయకులు గానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ గాని సాటిగా నిలవలేరన్నారు. సంఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ సమావేశాల నుంచి కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ను పంపించి వేశారన్నారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఎక్కడ ఎవరిని నిందించే విధంగా లేదన్నారు. సాధారణంగా అడవుల్లోకి అటవీశాఖ అధికారుల అనుమతితోనే వెళ్ళవలసి ఉందని. అలా కాకుండా అడ్డదారిన వెళ్లడం ఎర్రచందనం కేసుల్లో నిందితుడుగా ఉన్న రాజశేఖర కారణంగానే ఆ దారిన వెళ్లి ఉంటారని. పవన్ కళ్యాణ్ చెప్పారు అన్నారు. దాన్ని కొరముట్ల శ్రీనివాసులు రాజకీయం చేయడం తగదన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా వైసిపికి పేటెంట్ అని విమర్శించారు. అభం శుభం తెలియని ఎస్టీలు అని కొరముట్ల మాట్లాడడం తగదు అన్నారు. తాను అన్నేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసి ఎంతమంది ఎస్టీలకు మేలు చేశారు. ఎన్ని ఎస్టీ కాలనీలకు రోడ్డు వేయించారు. లెక్క చెప్పాలని నాగేంద్ర నిలదీశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఏడు నెలల్లో అరవ శ్రీధర్ చరిత్ర సృష్టించారన్నారు. తమ నాయకుడితో మాట్లాడి గంటల వ్యవధిలోనే ఎక్స్గ్రేషియన్ మంజూరు చేయించిన ఘనత శ్రీధర్ కే దక్కుతుందన్నారు. ముక్కారూపానందరెడ్డి కుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు. వారు బాధితుల పక్షాన నిలచి మృతులకు 1.లక్ష రూపాయల ప్రకారం అంత్యక్రియలకు 20వేల ప్రకారం ఇంటికి వెళ్లి అందించారన్నారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, హితవు పలికారు. అభివృద్ధిపై సద్విమర్శలు చేస్తే స్వీకరిస్తామన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు జోగినేని మని, పగడాల వెంకటేశు, మాదాసు నరసింహులు, మద్దెల వెంకటసుబ్బయ్య పగడాల చంద్రశేఖర్ సుధీర్ రెడ్డి, మద్దూరు మన్మధ, షేక్ రియాజ్ మాదాసు శివ పగడాల శివ, గుర్రంకొండ మనీ పెద్దం గారి సాయి కొనిశెట్టి శివ కడుమూరు సుబ్రహ్మణ్యం సువారపు నాగేశ్వరరావు దండు రమేష్ సువ్వారపు హరి ప్రసాద్ ఆనందల సాయి పవన్ రాజు మలిశెట్టి ప్రణీత్ మాదినేని రాజా సింగనమల శివ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment