ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలతో పోటీ చేసే దమ్ము ఉందా?

పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లాయర్స్ మీటింగ్లో వైఎ్సార్సీపీకి 2024లో 40 నుంచి 60 మధ్యలో సీట్లు వస్తాయి అని చెప్పగానే తాడేపల్లి ప్యాలెస్ వణికినట్లుంది. జనసేన పార్టీ నుంచి మేము ఒకటి అడుగుతున్నాం. మీరు మా అధ్యక్షున్ని 175 స్థానాల్లో పోటీ చేస్తారా అని అడిగారు. మిమ్మల్ని మేము అడుగుతున్నాం 175 స్థానాల్లో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలు పోటీ చేస్తారని చెప్పే దమ్ము మీకు ఉందా. అదే పేర్నినాని చిరంజీవి పై కపట ప్రేమ చూపిస్తున్నారు 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు నువ్వు ఎందుకు ప్రజారాజ్యం పార్టీకి సపోర్ట్ చేయలేదని, పాలేరు రాజకీయాలు చేస్తుంది నువ్వు మా అధ్యక్షుల్ని అనే స్థాయి నీది కాదు అని గుర్తు పెట్టుకో. మంత్రి రోజా నీ జబర్దస్త్ డ్రామాలు జనసేన పార్టీ ముందు వెయ్యకు నవ్వుల పాలు అయిపోతావ్, ముందు నీ నియోజకవర్గంలో రెండు గ్రూపులు ఉన్నాయి వాటినీ ముందు చూసుకో, మంత్రివర్గ విస్తరణ నవంబర్లో ఉంది కాబట్టి ఈ పేర్ని నాని వెల్లంపల్లి వచ్చి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తిడితే మళ్లీ మంత్రి పదవి చాన్స్ వస్తుంది అనే భ్రమలో ఉన్నట్టున్నారు. 2024 లో మీకు ప్రజలు బుద్ధి చెప్పే కాలం దగ్గర పడిందని పాలకొండ జనసేన పార్టీ నుండి మేము హెచ్చరిస్తున్నామని పాలకొండ జనసేన పార్టీ నాయకులు ప్రశాంత్ పోరెడ్డి, రమేష్ పొట్నూరు, దినేష్ తెలిపారు.